డిన్నర్ ఏ టైమ్ లో చేస్తే ఆరోగ్యానికి మంచిదంటే? టైమ్ ప్రకారం ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం రోజుకు రెండు సార్లు భోజనం చేయాలి. కానీ, ఈ రోజుల్లో చాలా మంది రోజుకు మూడుసార్లు మీల్స్ తీసుకుంటున్నారు. డిన్నర్ అనేది నిద్ర పోవడానికి రెండు గంటల ముందు చేయాలి. రాత్రి 8 గంటల లోపే డిన్నర్ చేయడం ఉత్తమం. సరైన టైమ్ కు భోజనం చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఆహారం చక్కగా జీర్ణమై, మంచి నిద్ర రావడంతో పాటు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రాత్రి పూట తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com