చర్మం అందంగా మెరవాలంటే.. ఈ డింక్స్ తీసుకోండి! కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల సహజంగా చర్మ సౌందర్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెరిసే చర్మాన్ని అందిస్తాయి. పాలలో కాస్త పసుపు కలిపి తాగడం వల్ల చర్మ నిగారింపు పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్ లోని బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలోవెరా జ్యూస్ చర్మ కాంతిని పెంచడంలో సాయపుతుంది. కీరాదోస జ్యూస్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చి నిగనిగలాడేలా చేస్తుంది. టమాటలోని విటమిన్ C చర్మకాంతిని పెంచుతుంది. బీట్ రూట్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం మీది మచ్చలను అరికడుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com