ఎండాకాలంలో చల్లని పుచ్చపండు తినడంలో మజాయే వేరు. కానీ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుని ఇది తినాలి.

పుచ్చపండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు అసలు తినకూడదు.

పుచ్చపండు తిన్నాక పాలు తాగొద్దు. పుచ్చపండులో విటమిన్ C ఉంటుంది. అందువల్ల రియాక్షన్స్ రావచ్చు.

పుచ్చపండు తిన్న తర్వాత ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. జీర్ణసమస్యలు వస్తాయి.

పుచ్చపండు తిన్న వెంటనే గుడ్డుతో చేసిన పదార్థాలు తింటే గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు రావచ్చు.

పుచ్చపండు మీద ఉప్పు చల్లి తినకూడదు. పుచ్చపండులోని పోషకాల శోషణలో ఆటంకం ఏర్పడుతుంది.

పుచ్చపండు తిన్న తర్వాత పెరుగుతినకూడదు. అసిడిటి సమస్య రావచ్చు.

పుచ్చపండు తిన్నాక డ్రైఫ్రూట్స్, గింజలు తినకూడదు. ఈ కాంబినేషన్ వల్ల మీ ఆరోగ్యానికి నష్టం జరగవచ్చు.

పుచ్చపండు తిన్న తర్వాత పప్పు తినకూడదు. ఎందుకంటే పప్పులో ప్రొటీన్ ఉంటుంది.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే