Image Source: Pexels

బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

బంగారం ధర ప్రస్తుతం తక్కువగానే ఉంది. మార్చి నెల నుంచి పెరిగే అవకాశం ఉంది.

కాబట్టి, బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన టైమ్. అలాగని కంగారులో తప్పులు చేయొద్దు.

బంగారం కొనుగోలు చేయడానికి ముందు మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. వాటిలో కొన్ని మీ కోసం..

ఫస్ట్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. నగరాన్ని బట్టి వ్యత్యాసం ఉంటుంది.

ఇక కొనుగోలు టైమ్‌లో మేకింగ్ ఛార్జీలను ఆరా తియ్యండి. అవి షాప్‌ను బట్టి మారుతుంటాయి.

గోల్డ్ మేకింగ్ చార్జీలు 6 నుంచి 20 శాతం వరకు ఉంటాయి. తక్కువ డిజైన్ నగల మేకింగ్ చార్జీలు తక్కువ.

ఇన్వెస్ట్మెంట్ కోసమైతే 24 క్యారట్ల బంగారాన్నే కొనండి. అవి మాత్రమే స్వచ్ఛంగా ఉంటాయి.

కానీ, నగలు 22 క్యారట్ల స్వచ్ఛత కలిగి ఉంటాయి. కొన్ని లోహాలు కూడా కలుస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలి.

Image Source: Pexels

చివరిగా.. నగలపై BIS హాల్‌మార్క్ ఉందో లేదో చెక్ చేయండి. అది ప్యూరిటీకి చిహ్నంలాంటిది.