కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడాన్ని కీటోజెనిక్ డైట్ అంటారు.

ఈ స్థితిలో శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వులను శక్తి కోసం వినియోగించుకుంటుంది.

ఈ రకమైన మెటబాలిక్ షిఫ్ట్ కారణంగా గణనీయంగా బరువు తగ్గుతారు.

కార్బోహైడ్రేట్లు తగ్గించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది.

కొంతమందిలో మందుల డోసేజ్ కూడా తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది కూడా.

కీటోన్స్ వల్ల గ్లూకోజ్ తో పోల్చినపుడు మెదడుకు మరింత శక్తి లభిస్తుంది.

అందువల్ల ఏకాగ్రత పెరిగి ప్రొడక్టివిటి పెరుగుతుంది. మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఈ రకమైన డైట్ ప్రారంభించిన మొదట్లో నీరసంగా ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత చాలా శక్తిమంతంగా అనిపిస్తుంది.

కీటోన్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. యాంటీఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels