పొద్దున్న నిద్ర లేవగానే నీళ్లు తాగడంతో రోజును ఆరంభిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇలా పొద్దున్నే నిద్ర లేవగానే నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

రాత్రి నిద్ర పోయి పొద్దున్న నిద్ర లేచే సమయానికి శరీరంలో ఫ్లూయిడ్స్ తగ్గిపోతాయి. కనుక పొద్దున్నే నీళ్లు తాగడంతో లోటు భర్తీ అవుతుంది.

ఉదయం మొదటి డ్రింక్ గా నీళ్లు తాగడం వల్ల రాత్రి నిద్రతో మందగించిన జీవక్రియలు వేగం పుంజుకుంటాయి.

రాత్రంతా మందగించిన జీవక్రియల వల్ల శరీరంలో మిగిలిపోయిన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

కిడ్నీ, లివర్ వంటి డీటాక్సికేటింగ్ అవయవాలు చురుకుగా పనిచెయ్యడం ప్రారంభిస్తాయి.

మెదడు హైడ్రేటెడ్ గా ఉండి పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతుంది.

పొద్దున్న లేవగానే నీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉండి ఉదయాన్నే తీసుకునే క్యాలరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images courtesy : Pexels