పాలు మంచి పౌష్టికాహారమే. కానీ వాటితో కొన్ని రకాల అనారోగ్యాలు కూడా కలుగవచ్చు.

పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువ. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు.

కొలెస్ట్రాల్ సమస్య లేకుండా పాలలో ఉండే పోషకాలు కలిగిన ప్రత్యామ్నాయ పదార్థాలను ఎంపిక చేసుకోవచ్చు.



పాలకు మంచి ప్రత్యామ్నాయం సోయా పాలు. ఇవి కొలెస్ట్రాల్ లేని పాలు. వీటిలో చాలా అన్ సాచ్యూరేటెడ్ కొవ్వులుంటాయి.

బాదం పాలను కూడా పాలకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. వీటితో కూడా కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఓట్మిల్క్ మంచి ఆహారం. వీటిలో బీటా గ్లూకగాన్ అనే ఫైబర్ వల్ల కొలేస్ట్రాల్ తగ్గుతుంది.

ఇవేవీ కాదనుకుంటే కొవ్వు తక్కువగా ఉండే లోఫ్యాట్ మిల్క్ వాడితే కొలెస్ట్రాల్ పెరగకుండా నివారించవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels