వేగనిజంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనా?

గత కొంత కాలంగా వేగనిజం అనేది ట్రెండ్ గా మారింది.

కేవలం మొక్కల నుంచి లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకునే వారిని వేగన్స్ అంటారు.

వేగన్స్ కూరగాయలు, ఆకు కూరలు, ధాన్యాలు, గింజలు, పండ్లు మాత్రమే తింటారు.

జంతు జాతులకు, పర్యావరణానికి హాని కలిగించని ఫుడ్ మాత్రమే తీసుకుంటారు.

జంతువుల నుంచి వచ్చే తేనె, పాల ఉత్పత్తులను కూడా వేగన్స్ తీసుకోరు.

సోయా ఉత్పత్తులు తింటారు కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం వాల్‌ నట్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది.

మాంసాహారం తీసుకోకపోవడం వల్ల కొంత పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఏదైనా సమస్య ఏర్పడితే మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లను తీసుకోవాలంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com