పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో ఫ్రొబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. పెరుగులో ప్రొటిన్ ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ. విటమిన్లు, మిరల్స్ ఎక్కువ. ఇవి జీవక్రియకు మంచివి. అయితే పెరుగు ఏ సమయంలో తినాలనే విషయంలో రకరకాల వాదనలున్నాయి. పెరుగును పగటి పూట తినడం మంచిదట. మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగితే పోషకాల శోషణ కూడా బావుంటుంది. ఫలితంగా శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. రాత్రి పూట పెరుగు తినకపోవడమే మంచిది. రాత్రి పెరుగు తింటే నిద్రకు భంగం కలిగించవచ్చు. ఇందులో ఉండే ప్రొటీన్ వల్ల జీర్ణం కావడానికి సమయం పట్టవచ్చు. అందువల్ల రాత్రి సమయాల్లో జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే పెరుగెప్పుడు మధ్యాహ్న భోజనం తర్వాతే తీసుకోవాలట. ఇలా తీసుకుంటే పెరుగుతో గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. ఆ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. Images and Video Credit: Pexels