జీలక్రర నీటిని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అందుకే వీటిని రెగ్యులర్​గా తీసుకుంటారు.

అయితే దీనిని ఏ టైమ్​లో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా వాటర్ తీసుకుంటే.. మెరుగైన జీర్ణక్రియ అందుతుంది. మెటబాలీజం పెరుగుతుంది.

జీరా వాటర్​ని భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

లంచ్ చేసిన తర్వాత తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది.

రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు. నిద్ర నాణ్యత పెరుగుతుంది.

రెగ్యులర్​గా జీలకర్ర నీటిని తీసుకుంటే బరువు కంట్రోల్ అవుతుంది. మెటబాలీజం పెరిగి కెలరీలు ఖర్చువుతాయి.

బ్లడ్​లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది.

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇమ్యూటినీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.