కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయో తెలుసా?

ఎంత అందంగా ఉన్నా, డార్క్ సర్కిల్స్ కారణంగా అందవిహీనంగా కనిపిస్తారు.

సరైన నిద్రలేక కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయని చాలా మంది భావిస్తారు.

కానీ, పలు అనారోగ్య కారణాలతోనూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి.

రక్తహీనత వల్ల కళ్ల కింది బాగాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగక డార్క్ సర్కిల్స్ వస్తాయి.

థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి.

విటమిన్స్ లోపం వల్ల కూడా కళ్లకింద నల్లటి వలయాలు వస్తాయి.

సరిపడ నీళ్లు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై డార్క్ సర్కిల్స్ వస్తాయి.

ఎలర్జీ లాంటి చర్మ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com