ఈ మధ్య కాలంలో ఒక ప్రణాళిక ప్రకారమే పిల్లలను కనాలని అనుకుంటున్నారు దంపతులు.

అలాంటి వారు కొన్ని రకాల గింజలు రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా గర్భం దాల్చవచ్చు.

గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ. ఈ పోషకం ప్రత్యుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణను పెంచుతుంది.

పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్ E పుష్కలం. ఇది వీర్యకణాలు చురుకుగా కదిలేందుకు, ఆండం ఆరోగ్యానికి అవసరం.

అవిసె గింజలల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు, లిగ్నాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్లను సంతులన పరుస్తాయి.

చియా సీడ్స్ తో ఒమెగా3ఫ్యాటీఆసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి హర్మోనల్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

నువ్వుల్లో జింక్, ఇతర ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి కూడా హార్మోన్ల సంతులనకు అవసరం.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.