మాంసాహారానికి, గుండె జబ్బులకు సంబంధం ఏంటి?

మాంసాహారం ఎంత తక్కువగా తీసుకుంటే గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది.

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు పూడినప్పుడే గుండె సమస్యలు ఏర్పడుతాయి.

మాంసాహారం తినడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య పెరుగుతుంది.

మాంసాహారంలో కొలిన్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి కారణం అవుతుంది.

దీనివల్ల రక్తసరఫరా సరిగా జరగక గుండెపోటు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది.

హై బీపీ, రక్తంలో కొలెస్ట్రాల్ కన్నా కొలిన్ తోనే ఎక్కువగా గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది.

సో, మాంసాహారాన్ని తగ్గించుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com