మనం లాప్ టాప్, ఫోన్, టీవి వంటి గాడ్జెట్స్ తో గడిపే సమయాన్ని స్క్రీన్ టైమ్ అని అంటారు.

ఈ గాడ్జెట్స్ వినియోగం శరీరంలో మెలటోనిన్ విడుదల మీద ప్రభావం చూపుతుంది.

మెలటోనిన్ మెదడులోని పీనియల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర పొయ్యేందుకు అవసరమయ్యే హార్మోన్.

కనుక స్క్రీన్ టైమ్ కచ్చితంగా నిద్ర సమయాల మీద ప్రభావం చూపుతుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్ర తగ్గితే మెదడు చురుకుదనం మీద నేరుగా ప్రభావం ఉంటుంది. కొత్తగా తీసుకునే సమాచారాన్ని స్వీకరించే వేగం కూడా తగ్గుతుంది.

తగినంత నిద్ర లేకపోతే కొత్తగా నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడం కూడా మెదడుకు కష్టమవుతుంది.

స్క్రీన్ చూసేందుకు మెడ వంచి ఉంచడం వల్ల భవిష్యత్తులో మెడ, నడుము నొప్పి సమస్యలు రావచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.