నెలసరి సమయంలో వచ్చే నొప్పికి మందులు వేసుకోవాలా వద్దా అనే దాని గురించి రకరకాల అనుమానాలున్నాయి.

కానీ కొందరు నిపుణులు ఏం పర్లేదు వేసుకోవచ్చు అంటున్నారు.

నెలసరి సమయంలో నొప్పి భరించలేనిదిగా ఉంటే తక్కువ డోస్ లో ఉండే పెయిన్ కిల్లర్లు వాడితే నష్టం లేదనది కొందరు డాక్టర్ల వాదన.

గర్భాశయంలోని పిరియడ్ బ్లడ్ మొత్తం బయటకు పంపేందుకు గర్భాశయం ఎక్కువ సంకోచిస్తుంది.

ఇలా సంకోచించేందుకు ఉపయోగపడే ప్రొస్టాగ్లాండిన్స్ అనే సమ్మేళనం శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

చాలా వరకు మెఫ్తాల్ వంటి పెయిన్ కిల్లర్లు గర్భాశయాన్ని రిలాక్స్ డ్ గా ఉంచుతాయి. అందువల్ల నొప్పి తగ్గుతుంది.

ఐబుప్రొఫెన్ వంటి ఇతర మందులు ప్రొస్టాగ్లాండిన ఉత్పత్తి తగ్గించడం వల్ల నొప్పి తగ్గిస్తాయి.

ఎనిమిది గంటల్లో కేవలం ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల నష్టం లేదనేది డాక్టర్ల సూచన.

ఈ సమాాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్లర్ల సూచన తర్వాతే పాటించాలి.