Image Source: pexels

వేసవిలో కూల్ కూల్‌గా పెరుగు అన్నం - జస్ట్ ఇలా చేస్తే చాలు, భలే రుచి!

పెరుగన్నం సంప్రదాయ వంటకం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.

అన్నంలో పెరుగుతోపాటు మసాలా దినుసులను కూడా యాడ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.

కప్పు బియ్యాన్ని కడిగి అందులో రెండు కప్పులు నీళ్లు పోసి మెత్తగా వండుకోవాలి.

వండిన అన్నంను గది ఉష్ణోగ్రతకు చల్లార్చాలి.

ఒకగిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకుని దానిని పల్చగా చేయండి. రుచికి సరిపడా ఉప్పువేసి కలపండి.

చల్లబడిన అన్నాన్ని పెరుగు మిశ్రమంలో వేసి కలపండి. అందులో కావాల్సిన పెరుగును కూడా వేసుకోవచ్చు.

ఒక చిన్న పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనే వేసి వేడి చేసి 2-3 ఎండు మిరపకాయలు వేయండి.

హాఫ్ టీస్పూర్ ఆవాలు, జీలకర్ర, పప్పులు, కరివేపాకు,ఇంగువ వేసి చిటపట అంటున్నప్పుడు పెరగన్నం అందులో వేయండి.

Image Source: pexels

తినేముందు కొబ్బరి తురుము, కొత్తమీరతో అలంకరించండి.