14 రోజులు షుగర్స్, స్వీట్స్ మానేస్తే వచ్చే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

చక్కెరలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దానిని తీసుకోవడం ఆపితే ఫ్యాట్ తగ్గడం మొదలవుతుంది.

షుగర్ తగ్గితే ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వచ్చి పొట్ట కొవ్వు తగ్గుతుంది.

చక్కెర వల్ల వచ్చే స్పైక్స్, క్రాష్‌లు తగ్గి రోజంతా స్టేబుల్ ఎనర్జీ ఉంటుంది.

స్కిన్ క్లియర్ అవుతుంది. పింపుల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చర్మం గ్లో ఇస్తుంది.

మొదటి 3,4 రోజులు కష్టంగా ఉన్నా.. తర్వాత స్వీట్స్ తినాలనే కోరిక తగ్గిపోతుంది.

నిద్ర మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ స్టేబుల్‌గా ఉండడంతో మంచి నిద్ర పడుతుంది.

ప్రాసెస్ చేసిన షుగర్ తగ్గడంతో గట్ హెల్త్ బెటర్ అవుతుంది.

షుగర్ తగ్గడం వల్ల ట్రైగ్లిసరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది.

మూడ్ స్వింగ్స్ తగ్గి ఫోకస్, క్లారిటీ పెరుగుతుంది.

ఒక్కసారిగా పూర్తిగా మానేయడం కష్టం అనుకుంటే క్రమంగా తగ్గించండి.