పెరుగు సరిగ్గా తోడుకోవట్లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే

Published by: Geddam Vijaya Madhuri

పాలు బాగా మరిగించి కొద్దిగా గట్టిగా అయ్యేలా చేయాలి. దీంతో పెరుగు గడ్డగా వస్తుంది.

పాలు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగు తోడు కలపాలి.

వేసవిలో ఎక్కువ తోడు పెరుగు వేస్తే.. పెరుగు త్వరగా పులుస్తుంది. కాబట్టి 1 కప్పు పాలకు పావు టీస్పూన్ తోడు సరిపోతుంది.

మట్టి పాత్రలో పెరుగు బాగా గట్టిగా సెట్ అవుతుంది. ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటుంది. స్టీల్ కూడా ఉపయోగించవచ్చు.

వేసవిలో 5 లేదా 6 గంటల్లోనే పెరుగు సెట్ అవుతుంది. ఎక్కువసేపు ఉంచితే పులిసిపోతుంది.

పెరుగు కాస్త గట్టిగా అయ్యిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. దీనివల్ల పులియడం తగ్గుతుంది.

పెరుగు సెట్ అవుతున్నప్పుడు నీళ్లు పడితే పలుచగా అవుతుంది. త్వరగా పాడవుతుంది.

డైరెక్ట్ వేడిలో ఉంచితే.. పెరుగు త్వరగా పులుస్తుంది. కాబట్టి కూల్ ప్లేస్‌లో పెట్టండి.

ఫుల్ క్రీమ్ పాలతో పెరుగు క్రీమీగా, గట్టిగా వస్తుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే వేసవిలో కూడా రుచికరమైన పెరుగు పొందవచ్చు.