72 గంటలు ఉపవాసం ఉంటే శరీరంలో జరిగేది ఇదే! 72 గంటల పాటు ఉపవాసం ఉంటే సెల్యులార్ క్లీనప్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. దెబ్బతిన్న కణాలను తొలగించి.. ఆరోగ్యకరమైన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఉపవాసం ఉంటే శరీరానికి ఇన్సులిన్ ప్రతిస్పందనను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉపవాసం ఉంటే బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గి కండర ద్రవ్యరాశిని కాపాడుతుంది. ఉపవాసంలో పుష్కలంగా నీరు తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. సుదీర్ఘ ఉపవాసం సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఉపవాస సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, మూర్ఛ వంటివి వస్తాయి. ఆకలి జీవక్రియ మార్పులు, నిద్రకు భంగం కలిగిస్తాయి. అలసట, చిరాకు కలిగిస్తాయి. 72 గంటల ఉపవాసాన్ని ప్రయత్నించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణుల సంప్రదించడం చాలా ముఖ్యం.