రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి! రోగ నిరోధక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సిట్రస్ పండ్లలోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. వెల్లుల్లిలోని అల్లిసివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ మరింత యాక్టివ్ చేస్తుంది. తాజాగా ఆకు కూరలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. బచ్చలికూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులు, పుదీనా ఇమ్యూనిటీని పెంచుతాయి. బాదం పప్పులలోని విటమిన్స్, మినరల్స్ రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com