హైబీపీని లైట్ తీసుకుంటే ఎంత డేంజరో తెలుసా? హైబీపీ మనిషికి తీవ్ర ముప్పును కలిగిస్తుంది. గుండె పనితీరుపై మరింత భారం పడుతుంది. శరీరానికి సరిపడ రక్తం సరఫరా చేయలేని పరిస్థితి కలుగుతుంది. రక్తనాళాలు దెబ్బతిని రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గి హార్ట్ అటాక్ రావచ్చు. సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయి కంటిచూపు మందగిస్తుంది. మెదడు రక్తనాళాలు చిట్లిపోయి పక్షపాతం వస్తుంది. కిడ్నీ చుట్టూ ఉన్న రక్తనాళాలు దెబ్బతిని రక్తం వడపోత మందగించడంతో పాటు మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com