పారాసెటమాల్ మాత్ర మంచిది కాదా? జ్వరం వస్తే మనం వెంటనే పారాసెటమాల్ వేసుకుంటాం. దాని వల్ల వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే, పారాసెటమాల్ మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి. ఔనండి, పారాసెటమాల్ మాత్రను అతిగా వాడితే లివర్ సమస్యలు రావచ్చట. ఇటీవల ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ షాకింగ్ విషయం తెలిసిందట. దీనిపై యూకేకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ అధ్యయనం జరిపింది. పారాసెటమాల్ వాడటం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ప్రయోగం ఎలుకలపైనా జరిపినా.. మనుషులపై కూడా ఇదే ప్రభావం ఉండవచ్చన్నారు. చూశారుగా, ఇకపై పారాసెటమాల్ వాడే ముందు ఒకసారి ఆలోచించండి. బాగా జ్వరం వస్తేగానీ ఆ మాత్ర జోలికి వెళ్లకండి. డాక్టర్‌ను సంప్రదించండి