Image Source: pexels

రాత్రి పూట ఈ పండ్లు తినకూడదని మీకు తెలుసా?

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని పండ్లు రాత్రిపూట తింటే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

యాపిల్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి రాత్రి తింటే ఆమ్లత స్థాయి పెరిగి అజీర్ణం, గుండెలో మంటలను కలిగిస్తాయి.

పుచ్చకాయలో చక్కెర, నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట మీ శక్తిని పెంచి నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.

అరటిలో ఫైబర్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

పైనాపిల్స్ లో బ్రోమెలైన్ ఉంటుంది. రాత్రి తింటే జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తుంది.

కివీని రాత్రి తినకూడదు. ఇందులోని అధిక ఫైబర్, చక్కెర మీ నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తుంది.

రాత్రిపూట జామపండ్లు తినకూడదు. ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ నిద్రను చెడగొడతాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.