అతిగా నిద్రపోతే డయాబెటిస్ వస్తుందా? మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగని మరీ ఎక్కువగా నిద్రపోతే సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. 9 గంటలకు పైగా నిద్రపోతే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదే పనిగా నిద్రపోతే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి ఊబకాయం వస్తుంది. ఎక్కువ నిద్ర కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి మలబద్దకం ఏర్పడుతుంది. అతి నిద్ర కారణంగా యాక్టివ్ నెస్ తగ్గి సోమరితనం వస్తుంది. 9 గంటలకు మించి నిద్రపోతే మైగ్రేన్ తలనొప్పి ఏర్పడే అవకాశం ఉంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com