కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే, జాగ్రత్త!

ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారు.

గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

రోజుకు కనీసం గంట పాటు వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.

వాకింగ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి బరువు పెరిగే అవకాశం ఉండదంటున్నారు.

హైబీపీ, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరవంటున్నారు.

రోజూ వాకింగ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ కూడా రాదంటున్నారు.

వాకింగ్ తో ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com