ట్రెడ్ మిల్ పై వాకింగ్ VS అవుట్ డోర్ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది ట్రెడ్ మిల్ పై నడవడం అనేది ఇండోర్ వ్యాయామం. బయట నడవడాన్ని అవుట్‌డోర్ వాకింగ్ అంటారు. మీరు బయట నడిచినప్పుడు స్వచ్చమైన గాలి పీల్చుకుంటారు. ట్రెడ్ మిల్ వాకింగ్‌లో అది సాధ్యం కాదు. బయట నడవడం, ట్రెడ్ మిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. బయట నడవడం అనేది సహజమైన శరీర కదలికలను కలిగి ఉంటుంది. ట్రెడ్ మిల్ కండరాలను పట్టేలా చేస్తుంది. ఇది కృత్రిమ కదలికలను కలిగిస్తుంది. ట్రెడ్ మిల్ పై నడవడం నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం చాలా మంది బయట నడిచేందుకు ఇష్టపడుతుంటారు. ట్రెడ్ మిల్స్ వేగాన్ని బట్టి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడంపై ప్రభావితం చూపుతుంది.