రోజ్ వాటర్ చర్మపు పీహెచ్ ను బాలెన్స్ చేసి చర్మంలో తడిని నిలిపి ఉంచుతుంది. చర్మం నునుపుగా తేమగా ఉంటుంది. రోజ్ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మంలో ఇరిటేషన్ నివారించి, సున్నితమైన తత్వం కలిగిన చర్మానికి మేలు చేస్తుంది. రోజ్ వాటర్ కంటి కింద ఏర్పడే పఫీ నెస్, నల్లని వలయాలను తగ్గిస్తుంది. సహజమైన ఆస్ట్రింజెంట్ గా పనిచెయ్యడం వల్ల రోజ్ వాటర్ తో ఓపెన్ పోర్స్ తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. చర్మంలో ఆయిల్ బాలెన్స్ చెయ్యడంలో రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. ఇది జిడ్డు, పొడి బారే రెండు రకల చర్మాలకు మేలు చేస్తుంది. గులాబి సువాసన మూడ్ బాగుచేస్తుంది. ఆందోళన తగ్గించి ఇది ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రోజ్ వాటర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. Representational image: Pexels