సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కంటి ఆరోగ్యం అన్నింటి కంటే ముఖ్యమని దీని అర్థం. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు కొన్ని విటమిన్లు, పోషకాలు తప్పకుండా అవసరమవుతాయి. విటమిన్ A, C కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు. ఇవి కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. బాదాముల్లో విటమిన్ E, ఒమెగా3ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. అక్రూట్స్ లేదా వాల్ నట్స్ లో కూడా ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటితో కళ్లు పొడిబారే సమస్య ఉండదు. కిస్మిస్ లో విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగ్గా ఉంచుతాయి. డ్రయిడ్ ఆప్రీకాట్లలో విటమిన్ A,E, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి చూపు మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతాయి. గోజీ బెర్రీల్లోజియాంగ్జంతిన్, ల్యూటిన్, విటమిన్ C, బీటాకెరోటిన్ ఉంటాయి. ఈ పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.