జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోవాలంటే? ఫీవర్ వచ్చినప్పుడు శరీరం నీరసంగా మారుతుంది. ఆహారం తీసుకోవాలి అని అస్సలు అనిపించదు. జ్వరం వచ్చినప్పుడు వీలైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్లు సూచించిన తాజా పండ్లు తీసుకోవాలి. అరటి, జామ లాంటి పండ్లు తీసుకోకూడదు. వైద్యుల సలహాతో కొబ్బరి నీళ్లు తాగాలి. పచ్చి ఆకుల జ్యూస్ జ్వరం నుంచి కోలుకోవడానికి సాయపడుతుంది. శరీరానికి కావాల్సిన కోర్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండే కిచిడీ లాంటి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచిన పండ్లు, కూరగాయాలు, జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగకూడదు. All Photos Credit: pexels.com