చుండ్రు ఉన్న వాళ్లు జుట్టుకు నూనె పెట్టుకోవచ్చా?

మహిళలను వేధించే జుట్టు సమస్యలలో చుండ్రు ఒకటి.

చుండ్రు ఉన్న వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

చుండ్రు ఉన్నవాళ్లు జుట్టుకు నూనె పెట్టుకోకూడదనే అపోహ ఉంది.

చుండ్రు ఉన్నా జుట్టుకు నూనె పెట్టుకోవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బాగా చుండ్రు ఉంటే దాన్ని క్లీన్ చేసి ఆయిల్ పెట్టాలి.

జుట్టుకు నూనె పెట్టి మసాజ్ చేసి.. 4 గంటల తర్వాత తల స్నానం చేయాలి.

చుండ్రు మీదే ఆయిల్ రాసి బయటకు వస్తే దుమ్ము చేరి సమస్య మరింత పెరుగుతుంది.

చుండ్రు ఉందని అస్సలు నూనె పెట్టకపోతే జుట్టు పొడిబారి రాలిపోతుంది.

చుండ్రు ఉన్నా నూనె రెగ్యులర్ గా పెడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com