తక్కువ నిద్రతో డయాబెటిస్ వస్తుందా? రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలంటున్నారు నిపుణులు. కంటి నిండా నిద్రపోతే అనారోగ్యం దరిచేదంటున్నారు. తక్కువ నిద్ర కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పటికీ తక్కువ నిద్రతో డయాబెటిస్ వస్తుందంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా యువతలో డయాబెటిస్ పెరుగుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాత్రి మేల్కొనడం, సరైన నిద్రవేళలు పాటించకపోవడం వల్ల డయాబెటిస్ ముప్పు పెరుగుతుందంటున్నారు. ప్రతి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు వైద్యులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com