బరువు తగ్గాలనుకుంటే 1:5:1 రూల్ బెస్ట్.. అసలు మ్యాటర్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

ఈ నియమం ఎలాంటి 'క్రష్ డైట్' కాదు. కానీ బరువు తగ్గడానికి ఒక అత్యంత సమతుల్య జీవనశైలి సూత్రం.

రోజుకు కనీసం ఒక గంట శారీరక శ్రమ (నడక లేదా వ్యాయామం) చేయడం తప్పనిసరి.

5 ఐదు సార్లు రోజుకు మూడు భారీ భోజనం చేయడానికి బదులుగా 5 సార్లు చిన్న చిన్న ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి.

శరీరానికి తగినంత నీరు అందించడానికి.. మీ బరువులో ప్రతి 20 కిలోలకు కనీసం 1 లీటరు నీరు తాగాలి.

మీరు తీసుకునే 1 గ్రాము చక్కెరకి 5 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

5 గ్రాముల ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. తరచుగా ఆకలిని తగ్గిస్తుంది.

చపాతీలు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని దూరంగా ఉంచితే మంచి ప్రయోజనాలు చూస్తారు.

మాంసకృత్తుల కోసం గుడ్లు, పప్పులు, సోయాబీన్, పనీర్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి.

కార్బోహైడ్రేట్స్ అయిన ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా లాంటి సంక్లిష్ట కార్బ్స్ ను ఎంచుకోవాలి.

ఈ ఫార్ములా జీవక్రియను మెరుగుపరుస్తుంది. డైటింగ్ పేరుతో ఆకలితో ఉండకుండా సహజంగా కొవ్వును తగ్గిస్తుంది.

ఇది అవగాహన కోసమే. నిపుణుల సలహాలతో ప్రారంభిస్తే మంచిది.