Image Source: Pixabay and Pexels

బోన్ క్యాన్సర్ - ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

క్యాన్సర్ మహమ్మారి సోకితే.. అంత ఈజీగా వదిలిపెట్టదు. కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం.

కొన్ని క్యాన్సర్లను మనం అస్సలు గుర్తించలేం. వాటిలో ఒకటి బోన్ క్యాన్సర్.

బోన్ క్యాన్సర్.. మానసికంగా శారీరకంగా నరకం చూపిస్తుంది. కాబట్టి, దాని లక్షణాలను ముందుగా తెలుసుకోవాలి.

ఎముక లోపల కణాల అసాధారణ పెరుగుదల కణితిలా మారుతుంది. అదే బోన్ క్యాన్సర్‌గా మారుతుంది.

బోన్ క్యాన్సర్ ప్రాణాంతకమైనది. ఇది మెల్లగా శరీరమంతా విస్తరించి ప్రమాదకరంగా మారుతుంది.

ఈ క్యాన్సర్ వల్ల ఎముకలు బలహీనమవుతాయి. పగుళ్లు ఏర్పడతాయి. చిన్న గాయాలకే విరిగిపోతాయి.

ఈ క్యాన్సర్ ప్రభావం కణజాలం, నరాల మీద కూడా పడుతుంది. ఫలితంగా నొప్పితో విలవిల్లాడతారు.

ఈ క్యాన్సర్ సోకితే నడవడం చాలా కష్టం. కాళ్లు మీ బరువును మోయలేవు.

ఎముకల్లోని కాల్షియం రక్తంలోకి చేరడం వల్ల మైకం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image Source: Pixabay and Pexels

తీవ్రమైన అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.