ఈ ఫుడ్స్ తింటే పైసా ఖర్చు చేయకుండా కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు ఓట్స్ లో కరికే ఫైబర్ ఉంటుంది. ప్రత్యేకంగా బీటా గ్లూకాన్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. బాదం, వాల్నట్స్ లో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఇ ఉంది. అవకాడోలో మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. సాల్మన్, మాకేరెల్స్, సార్డినెస్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. బిపిని కంట్రోల్లో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్లు, మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బీన్స్, కాయధాన్యాల్లో కరికే ఫైబర్ ఉంటుంది. ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వంకాయలో కరికే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.