వర్షాకాలం వచ్చిందంటే ఈగల బెడద మొదలవుతుంది. ఈగలను తరిమేసే ఉపాయాలు చూద్దాం.

కర్పూరం వెలిగించి ఇల్లంతా కర్పూరం పొగ వేస్తే ఈగలు పారిపోతాయి.

స్ప్రే బాటిల్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీళ్లు నింపి ఇంట్లో నలువైపులా స్ప్రే చెయ్యలి.

నిమ్మకాయ రసంలో ఉప్పు కలిపి దాన్ని బాటిల్ నీళ్లలో కలిపి ఈగలున్న చోట స్ప్రే చెయ్యాలి.

ఈగలున్న చోట బిర్యాని ఆకు కాల్చి పెట్టాలి. ఈ పొగను ఇల్లంతా చూపించాలి.

ఈగలకు దాల్చీని వాసన నచ్చదు. ఈగలు వచ్చే ప్రదేశాల్లో దాల్చీని ముక్కలు పెట్టాలి.

పుదీనా వాసనకు ఈగలు దరిచేరవు. ఇంట్లో పుదీనా మొక్క లేదా లావెండర్ మొక్క పెట్టుకుంటే ఈగలు రావు.

ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఫినాయిల్ కలపడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే