ప్రతీ ఉదయాన్ని నడకతో ప్రారంభిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా రోజంతా పాజిటివ్ గా గడుస్తుంది. ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తే శరీరం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. డాక్టర్లు కూడా బయట నడవడానికి వెళ్లాలని చెబుతుంటారు. ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు నడవాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇది ఉదయం పూట అయితే త్వరగా ఈ లక్ష్యాన్ని పూర్తి చెయ్యవచ్చు కూడా. రోజూ ఉదయాన్నే 30 నిమిషాల పాటు నడిస్తే 150 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. ఆహారపు అలవాట్లు తోడైతే బరువు సులభంగా తగ్గొచ్చు. వాకింగ్ తో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అందువల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. వాకింగ్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే వర్కవుట్ చేసే వారికి ముఖ్యంగా వాకింగ్ చేసే వారికి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు ఓవరాల్ గా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే