మీ పాదాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే, షుగర్ పెరిగినట్లే! హై బ్లడ్ షుగర్, హైపర్గ్లైసీమియా అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోస్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఇది. హై బ్లడ్ షుగర్ శరీరంలో అన్ని అవయవాలపై ఎఫెక్ట్ చూపుతుంది. పాదాలలోనూ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మొదటి సంకేతం పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపు. ఇది హై బ్లడ్ షుగర్ లెవల్స్ వల్ల కలిగే నరాల నష్టం వల్ల సంభవిస్తుంది. పాదాలు పొడిబారడం, పగిలిన చర్మం మరో సంకేతం. హై బ్లడ్ షుగర్ వల్ల చర్మంలో తేమ తగ్గుతుంది. ఎందుకంటే హై గ్లూకోజ్ లెవల్స్ రక్త నాళాలను దెబ్బతీస్తాయి. పాదాలలో వాపు కూడా హైబ్లడ్ షుగర్ కు సంకేతం కావచ్చు. అదనపు గ్లూకోజ్ శరీరంలో ద్రవాన్ని నిలుపుతుంది. పాదాలపై నల్ల మచ్చలు.. ప్రత్యేకంగా కాలి, చీలమండలంపై రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే కనిపిస్తాయి