పాములంటే అందరికీ భయమే. కలలో కనిపించినా సరే భయపడతాం.

కలలో పాము కనిపించడం భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను తెలియజేస్తుందని జ్యోతిషం చెబుతోంది.

కలలో పాము కరిస్తే ఒక హెచ్చరికగా భావించాలి.

భవిష్యత్తులో జరగబోయే పెద్ద మార్పుకు లేదా కీడుకు సంకేతం కావచ్చు.

కుటుంబ జీవితంలో కలిగే పెద్దకుదుపుకు సంకేతం కావచ్చు. ఏవైనా అభిప్రాయ బేధాలు ఉంటే తీర్చుకోవడం మంచిది.

ఆత్మీయులెవరో మీకు ద్రోహం చేస్తున్నారని అనేందుకు సంకేతం కావచ్చు.

జీవితం ఇస్తున్న మరో అవకాశంగా కూడా భావించవచ్చు. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగాలనేందుకు సంకేతం కావచ్చు.

పాము కలలో కనిపిస్తే అది మీరు ఏదో తీర్చలేని సమస్యతో బాధపడుతున్నారని అర్థం.

కలలో పాము కనిపించడం అనేది శుభాశుభ సంకేతాలు రెండింటికి కారణం కావచ్చు

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే