Image Source: pexels

ఒంట్లో రక్తం తక్కువగా ఉందా?ఈ ఫుడ్స్ తినండి

ప్రతిరోజూ తలనొప్పి, అలసటతో బాధపడుతుంటే మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అర్థం



ఐరన్ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే రక్తహీనతను తగ్గించుకోవచ్చు.

ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉన్న పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవాలి.

బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల నుంచి క్యారెట్, బీట్ రూట్ వరకు ఇవన్నీ నిత్యం తినాలి.

వీటిని పచ్చిగా లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష, పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

మాంసం, చేపలలో ప్రొటీన్ ఉంటుంది. వీటిని డైట్లో చేర్చుకుంటే మీ శరీరానికి ఐరన్ అందుతుంది.

రక్తహీనతతో బాధపడుతున్నవారు పప్పులు, బీన్స్, కిడ్నీ బీన్స్, చిక్ పీస్ వంటివి చేర్చుకోవాలి.

Image Source: pexels

గుడ్లలో ప్రొటీన్ ఉంటుంది. ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని డైలీ డైట్లో చేర్చుకోవాలి.