పసుపును ఏ కాలంలో అయినా ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు.

కానీ సమ్మర్​లో వేడి ఎక్కువగా ఉంటుంది. పసుపు తీసుకుంటే వేడి వస్తుందని చెప్తారు. మరి దీనిని ఎలా తీసుకోవాలి?

బేసికల్​గా పసుపును సమ్మర్​లో తీసుకుంటే చాలా మంచిది. హైడ్రేషన్​ని శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తుంది.

సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో యాంటీఆక్సిడెంట్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయి.

అర టీస్పూన్ పసుపును గ్లాసు నీటిలో తీసుకోవాలి. ఇది రోజంతా హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

అర టీస్పూన్ పసుపును కప్పు హాట్ వాటర్​లో వేసి.. దానిన చల్లారనిచ్చి ఫ్రిడ్జ్​లో పెట్టాలి. దానిని చల్లగా అయిన తర్వాత తాగాలి.

పెరుగులో పసుపు, తేనె కలిపి స్వీట్, కూలింగ్ డిజెర్ట్​గా తీసుకోవచ్చు. అర టీస్పూన్ పసుపు సరిపోతుంది.

పసుపుతో ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. పెరుగులో కలిపి స్కిన్ హెల్త్​ కోసం ఉపయోగించవచ్చు.

కీరదోస సలాడ్​లో పైన చల్లుకుని తినొచ్చు. ఇది హీట్​ని తగ్గించి రిఫ్రెషింగ్​గా ఉంచుతుంది.