పుచ్చకాయను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

హైడ్రేషన్ కోసం.. ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం పుచ్చకాయను రెగ్యులర్​గా డైట్​లో తీసువచ్చు.

అయితే పుచ్చకాయ అంటే ఎంత ఇష్టమున్నా.. దానిని లిమిట్​గానే తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మరి వాటర్​ మిలాన్ ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయను రోజుకు 1 నుంచి రెండు కప్పులు అంటే 150 గ్రాముల నుంచి 300 గ్రాములు తీసుకోవచ్చు.

పుచ్చకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎక్కువ తింటే యూరిన్ సమస్యలు రావొచ్చు.

పుచ్చకాయల్లో సహజమైన షుగర్ ఉంటుంది. ఎక్కువ తింటే షుగర్ స్పైక్స్ అవుతాయి.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీనిని లిమిటెడ్​గా తింటేనే మంచిది.

పొటాషియం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలు రావొచ్చు. గుండెకు మంచిది కాదు.

రాత్రుళ్లు కంటే ఉదయం, మధ్యాహ్నం తింటేనే మంచిది.