ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు, కంట్లో దుమ్ము పడినప్పుడు ఇతర కారణాల వల్ల సందర్భానుసారంగా నీళ్లు వస్తాయి.

అయితే ఏమి జరగకుండానే కంట్లోనుంచి నీళ్లు వస్తున్నాయంటే దాని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థమట.

అలెర్జీలు, కండ్లకలకు ఇది సంకేతం కావొచ్చని చెప్తున్నారు. ఆ సమయంలో కళ్ల నుంచి నీరు వస్తుందట.

పొడి కళ్లు ఉన్నవారికి కూడా తెలియకుండానే కంటి నుంచి నీరు వస్తుందట.

బ్యాక్టీరియల్, వైరల్ ఇన్​ఫెక్షన్లు కూడా కంటి నుంచి నీరు కారేలా చేస్తాయట.

కంటి గాయాలు, కళ్లు చిరిగిపోవడం వంటివి కూడా కన్నీరును ఉత్పత్తి చేస్తాయి.

యాంటిహిస్టామైన్లు లేదా డీకాంజెస్టెంట్లు వంటి కొన్ని మెడిసన్స్ కూడా దీనికి కారణమవ్వొచ్చు.

థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది.

కంటి నుంచి ఎక్కువగా నీరు వస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి.

కంటి నొప్పి, ఎరుపు, దృష్టిలోపం ఎక్కువ అవుతూ నీరు వస్తుంటే వైద్యలను సంప్రదించాలి.