టాక్సిక్ సమస్యలను దూరం చేసి.. జీర్ణ సమస్యలను తగ్గించడంలో టీ మంచి ప్రయోజనాలు ఇస్తాయి. టీ ఆకులు మంచి ప్రయోజనాలు ఇస్తాయి. ఇవి లోపలి నుంచి, బయటి మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందాయి.
బ్లాక్ టీ తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతుంది. వీటిని తీసుకున్నప్పుడు అవి జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, జీవక్రియను పెంచడానికి, పేగు కదలికలను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
చాలా మంది టీ ఆకులను షాంపూనకు సహజమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. టీ నీరు కఠినమైన రసాయనాలు లేకుండా మురికిని తొలగిస్తాయి. సెన్సిటివ్ స్కాల్ ఉండేవారికి కూడా ఇది మంచిది.
జుట్టు రాలడాన్ని తగ్గించడం నుంచి వైట్ హెయిర్ రంగును మార్చడం వరకు.. ఈ సహజ పద్ధతికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
టీ ఆకులు సహజంగా తెల్ల వెంట్రుకలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని రెగ్యులర్గా వాడడం వల్ల కెమికల్స్ లేకుండానే కాలక్రమేణా తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
టీ ఆకులు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. వర్ణద్రవ్యతను మెరుగుపరుస్తాయి. మీ జుట్టును నల్లగా, బలంగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తాయి.
టీ నీరు తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కుదుళ్లను పోషిస్తుంది. మందంగా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది.
టీ ఆకులను మరిగించిన నీరు జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని తగ్గుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కుదుళ్ల మూలాలను బలపరుస్తాయి. చికాకును తగ్గిస్తుంది.
టీ ఆకుల నీరు సహజంగా జుట్టుకు మెరుపును అందిస్తాయి. మృదువుగా చేస్తాయి.