ఉదయం నడక ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అయితే కొన్ని తప్పులు చేయడం వల్ల ప్రయోజనాలు తగ్గుతాయి. లేదా హాని కూడా కలుగుతుంది.
ఉదయం వేళ కాలుష్యం తక్కువగాను, ఆక్సిజన్ శాతం ఎక్కువగాను ఉంటాయి. కాబట్టి నడవడానికి ఇది అనువైన సమయం. కానీ సరైన శ్వాస పద్ధతులు పాటించకపోతే ఆక్సిజన్ తీసుకోవడం పరిమితం కావచ్చు.
భోజనం చేసిన తర్వాత నడిచేప్పుడు చెప్పులు వేసుకోకపోవడం మంచిది. ఇది మీ నడకను మెరుగుపరిచి.. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
నడకకు వెళ్లే ముందు భారీ ఆహారం తీసుకోకపోవడమే మంచిది. లేదంటే బద్ధకంగా, తిమ్మిర్లు, అలసట వంటివి కలుగుతాయి. ఖాళీ కడుపుతో నడవండి. లేదా తేలిక ఆహారం తీసుకుని వాకింగ్ చేయవచ్చు.
నిర్జలీకరణం అలసటకు, కండరాల తిమ్మిరికి దారి తీస్తుంది. ఉదయం నడక కోసం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు నీరు తాగాలని గుర్తించుకోండి.
పాత లేదా సరిగ్గా సరిపోని బూట్లు వేసుకోవడం వల్ల మీ పాదాలు కీళ్లు, భంగిమ దెబ్బతినవచ్చు. నడవడానికి అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉండే బూట్లు ఎంచుకోండి.
మీ వెన్నుముకను నిటారుగా ఉంచండి. భుజాలను వదులుగా ఉంచండి. తలను పైకి ఎత్తండి. నడక సమయంలో సరిగ్గా భంగిమ పాటించకపోతే దీర్ఘకాలిక వెన్ను, మెడ సమస్యలు వస్తాయి.
నడకలో ఎక్కువ దూరం వెళ్లడం లేదా పాదాలను లాగడం.. కండరాలు, కీళ్ళపై ఒత్తిడిని కలుగుతుంది. సహజమైన నడకను లక్ష్యంగా పెట్టుకోండి. స్థిరమైన వేగాన్ని కొనసాగించండి.
నడకకు ముందు చల్లటి నీరు లేదా కెఫిన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు లేదా నిర్జలీకరణం ఏర్పడవచ్చు. వెళ్లే ముందు గది ఉష్ణోగ్రత నీటిని తీసుకోండి.