ఉదయం లేవగానే శరీరం ఇచ్చే వ్యాధి సంకేతాలు ఇవే.. ఇగ్నోర్ చేయొద్దు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఉదయం నిద్ర లేవగానే మీ శరీరంలో బరువుగా లేదా నొప్పిగా అనిపిస్తుందా?

Image Source: freepik

చాలా మంది ఉదయం వచ్చే ఒంటి నొప్పులను అలసట, తప్పుడు భంగిమలో నిద్రపోవడం లేదా వయసు పెరగడం వల్ల కలిగే సమస్య అనుకుంటారు.

Image Source: freepik

కానీ మార్నింగ్ వచ్చే ఈ నొప్పులు ఉదయం లేవగానే శరీరం కొన్ని రోగాల సంకేతాలు ఇస్తుందట.

Image Source: freepik

ఉదయం నిద్ర లేచిన వెంటనే శరీరంలో బిగుతుగా అనిపిస్తే.. ఇది ఆర్థరైటిస్ (Arthritis) సంకేతం కావచ్చు.

Image Source: freepik

మీరు ఒకే భంగిమలో గంటల తరబడి పడుకుంటే లేదా దిండు చాలా ఎత్తులో ఉంచుకుంటే.. అది శరీర రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.

Image Source: freepik

ఉదయం లేచిన వెంటనే తరచుగా తలనొప్పి వస్తే అది మైగ్రేన్ లేదా రక్తపోటుకు సంకేతం కావచ్చు.

Image Source: freepik

రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి ఉంటే.. ఇది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం కావచ్చు.

Image Source: freepik

ఉదయం నిద్ర లేచిన వెంటనే మాట్లాడటంలో ఇబ్బంది లేదా నత్తిగా అనిపిస్తే.. ఇది మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం (స్ట్రోక్ ప్రమాదం) వల్ల కావచ్చు.

Image Source: freepik

మీకు ప్రతిరోజు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈ వ్యాధుల పరీక్షలు చేయించుకోండి.

Image Source: freepik