మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్స్ మితిమీరితే ఇంతే!

Published by: Suresh Chelluboyina

శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. అయితే, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.

మోతాదుకు మించిన ప్రోటీన్లు తీసుకుంటే.. అవి శరీరానికి ఇబ్బందిగా మారవచ్చు.

అయితే, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నామా? తక్కువ తీసుకున్నామా అనేది ఈజీగా గుర్తించలేం.

కాబట్టి, మీలో ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా.. శరీరంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోండి.

ప్రోటీన్ మోతాదు పెరిగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వుతుంది. ఎక్కువగా దాహం వేస్తుంది.

ప్రోటీన్ ఎక్కువైతే.. అది క్రమేనా బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. కిడ్నీ సమస్యలూ రావచ్చు.

ప్రోటీన్ మోతాదు పెరిగితే.. మన శ్వాస పండ్లు లేదా నైల్ పాలిష్ తరహా వాసన వస్తుంది.



మితిమీరిన ప్రోటీన్, లో-ఫైబర్ వల్ల మలబద్దకం వస్తుంది. ఇది తగ్గాలంటే వాటర్ బాగా తీసుకోవాలి.



కొందరిలో డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్య వస్తే డాక్టర్‌ను కలవాలి.