రెండే షాట్స్.. HIV ఎయిడ్స్ పరార్ HIV ఎయిడ్స్ మహమ్మారి.. చాలా ప్రమాదకారి. ఒకసారి సోకితే జీవితం నరకమే. HIV కేవలం శరీరక కలయికే కాదు.. వేరే కారణాల వల్ల కూడా సోకుతుంది. ఇప్పటి వరకు ఎయిడ్స్‌కు మందు లేదనే సంగతి తెలిసిందే. నివారణ ఒక్కటే మార్గం. గుడ్ న్యూస్ ఏమిటంటే.. రెండే రెండు వ్యాక్సిన్ షాట్స్ తీసుకుంటే ఆ వ్యాధి దరిచేరదట. తాజా అధ్యయనం ఒకటి.. ఈ వివరాలను తెలిపింది. ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదని పేర్కొంది. అధ్యయనంలో భాగం ఆఫ్రికా, ఉగాండాలో 5 వేల మంది మహిళలకు ‘లెనకాపవిర్’ అనే షాట్స్ ఇచ్చారట. ఈ వ్యాక్సిన్ పొందిన మహిళలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాలేదని అధ్యయనంలో తెలిపారు. అమెరికాకు చెందిన ‘గిలియడ్’ వీటిని తయారు చేస్తోంది. ‘సన్‌లెంకా’ పేరుతో విక్రయిస్తోంది. పురుషులపై కూడా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే ఎయిడ్స్‌కు మందుకు దొరికినట్లే. నోట్: పలు అధ్యయనాలు, జర్నల్స్ ఆధారంగా ఈ వివరాలు అందించాం. డాక్టర్ సలహాలు తప్పక తీసుకోవాలి.