అదేంటీ? రంగును బట్టి క్యాప్సికమ్‌లో పోషకాలు మారుతాయా? ఏది బెటర్?

క్యాప్సికమ్‌లో చాలా పోషకాలు ఉంటాయి. మనలో చాలామంది గ్రీన్ క్యాప్సికమ్ తింటాం.

మార్కెట్‌లో రెడ్, యెల్లో, గ్రీన్ రంగుల్లో క్యాప్సికమ్‌లు అందుబాటులో ఉంటాయి.

గ్రీన్ క్యాప్సికమ్స్‌లో క్యాలరీలు తక్కువ. అంత తియ్యగా కూడా ఉండదు.

గ్రీన్ బెల్ పెప్పర్‌లో విటమిన్-C, K, పొటాషియం, ఫైబర్ ఉంటాయి.

రెడ్ క్యాప్సికమ్‌ కాస్త తియ్యగా ఉంటుంది. గ్రీన్‌‌లో ఉండే పోషకాలే ఇందులో ఉంటాయి.

గ్రీన్ క్యాప్సికమ్‌తో పోల్చితే ఇందులో విటమిన్ C, B6, A ఎక్కువ. ఫైబర్ కూడా పుష్కలం.

పసుపు షిమ్లా మిర్చిలో పోషకాలన్నీ బ్యాలెన్సుడ్‌గా ఉంటాయి. రెడ్‌లోనే పోషకాలు ఎక్కువ.

విటమిన్స్ విషయానికి వస్తే.. రెడ్‌ క్యాప్సికమ్‌ చాలా బెటర్.

కాబట్టి, మీకు అవసరమైన పోషకాలకు తగిన క్యాప్సికమ్‌లనే ఎంచుకోండి.