రోజూ అరగంట నడిస్తే చాలు.. ఈ హెల్త్ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజు 30 నిమిషాల నుంచి గంట నడవడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఒక వైద్య నివేదిక ప్రకారం క్రమం తప్పకుండా నడవటం వల్ల మెదడు, గుండెపోటు వచ్చే ప్రమాదం 20 నుంచి 40% తగ్గుతుంది.

ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు వేగంగా నడవటం వలన 200 కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు, పొట్ట కొవ్వును (Belly Fat) వేగంగా తగ్గిస్తుంది.

నడవడం వల్ల కాళ్లు, నడుము, పొత్తికడుపు కండరాలు బలపడతాయి. ఎముకల సాంద్రత పెరగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వేగంగా నడుస్తున్నప్పుడు శ్వాస వేగం పెరగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

సరిపడా ఆక్సిజన్ అందడం వల్ల శరీరం సహజంగా నిర్విషీకరణ చెందుతుంది. శక్తి స్థాయి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది.

నడవడం వలన మానసిక ఆరోగ్యానికి నేరుగా సానుకూల ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.

గాయాల నుంచి కాకుండా ఉండేందుకు నడక ముందు 20 సెకన్లు చేతులు, కాళ్లు స్ట్రెచ్ చేయాలి.

కీళ్ల లేదా గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధి ఏదైనా ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే నడవండి.