ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థకు విటమిన్ D అవసరం. విటమిన్ D2, D3 ఫుడ్ లేదా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. విటమిన్ D2.. మొక్కలు, శిలీంద్రాలు, పుట్ట గొడుగులు, మిల్లెట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. D3 సూర్యకాంతి, కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ D లెవల్స్ పెంచడంలో D2 కంటే D3 ఎక్కువ మెరుగ్గా పనిచేస్తుంది. D2 కూడా శరీరంలో విటమిన్ D స్థాయిలను పెంచుతుంది. కానీ, విటమిన్ D3 వలే శక్తివంతంగా ఉండకపోవచ్చు శరీరంలో విటమిన్ D స్థాయిలను పెంచడం వల్ల విటమిన్ D3ను మెరుగైనదిగా పరిగణిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. విటమిన్ D లోపం ఉన్నవారికి వైద్యులు సిఫార్సు చేస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్స్ తక్కువ ఉపయోగించినప్పటికీ, D2 సప్లిమెంట్స్ శరీరంలో విటమిన్ Dని పెంచుతుంది. కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల విటమిన్ D3 మన శరీరానికి అందుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.